సోమవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత, కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ మాజీ ఉప సర్పంచ్ తెలుగు బాలచందర్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, సీఎం నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని బాలచందర్ కు సూచించారు.