దేవరకద్ర: సైబర్ మోసం.. రూ. 18. 50 లక్షలు మాయం

దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతలలో ఒకరి ఖాతా నుంచి రూ. 18. 50 లక్షలు మాయం చేసిన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య అనే వ్యక్తికి సైబర్ నేరగాళ్ల నుంచి గత నెల 19న కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు మిస్యూస్ అయిందని, మీ ఖాతాల్లో డబ్బులు ఉండేవిధంగా చేస్తామని నమ్మించారు. అందుకు డబ్బు తమ ఖాతాకు పంపించాలని చెప్పగా నమ్మి 3 సార్లు నగదు బదిలీ చేశాడు.

సంబంధిత పోస్ట్