దేవరకద్ర: ఘనంగా ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు

దేవరకద్ర మండలం బలుసుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారురాలు కుందుర్ లావణ్య, దాసరి జములమ్మ ఇంటి భూమి పూజల కార్యక్రమం ఏఈ ఆకాష్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పుట్ట చంద్రమౌళి మాట్లాడుతూ పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, వడ్డే ఆంజనేయులు, కోట గణేష్. రాము, జంగ వెంకటేష్. మంగన్న, దాసరి వెంకటయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్