దేవరకద్ర: టైర్ పంక్చర్.. త్రుటిలో తప్పిన ప్రమాదం

టైర్ పంక్చర్ అయి రోడ్డు పక్కకు లారీ దూసుకెళ్లిన ఘటన దేవరకద్ర నియోజకవర్గంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఓ లారీ మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ టోల్ గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా పంక్చర్ అయ్యి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్