దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మార్కెట్ యార్డ్ లో హమాలి సంఘం భవన నిర్మాణంకు శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, నిరంతరం చమటోడ్చే కార్మికుల కష్టాలను గుర్తించి, వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా నేడు భవనం నిర్మిస్తామన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.