మహబూబ్ నగర్: 400 ఉద్యోగాలకు జాబ్ మేళా

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ మన్నన్ ట్రైడర్స్ బిల్డింగ్ లో ఈ నెల 10న గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో 400 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఉ. 10: 30 నుంచి మ. 3: 00 వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని అన్నారు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పాసైన వారు అర్హులని పేర్కొన్నారు. 18-30 ఏళ్ల వయస్సులోపు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్