మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ గుట్టమీద తండాలో రేషన్ బియ్యం పంపిణీ చేయాలని తండావాసులు శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి గుట్టమీద తండావాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాండాలోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.