మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం యెన్నం శ్రీనివాసరెడ్డిని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు భూపతి సింగ్ తో కలిసి పలు విద్యావిషయక అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే జిల్లాను విద్యాహబ్ గా మార్చడానికి చేపట్టిన విద్యానిధికి పీఆర్టీయూ తెలంగాణ ఇచ్చిన మద్దతుకు సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డిని అభినందించారు.