గద్వాల పట్టణంలోని భీంనగర్, రెవెన్యూ కాలనీ పరిసరాల్లో కుక్కల బెడద తీవ్రమైంది. పాఠశాలల నుంచి వచ్చే పిల్లలు, రాత్రిపూట ఒంటరిగా వెళ్లేవారు కుక్కల గుంపులను చూసి భయపడుతున్నారు. కుక్కల దాడి ప్రమాదం ఉందని, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వాటిని నియంత్రించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.