బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు విజయవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ. తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.