గద్వాల: ఆలయాలకు కార్తీక పౌర్ణమి శోభ.. పోటెత్తిన భక్తులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదీ అగ్రహారం వద్ద కృష్ణానదీ పుష్కరఘాట్ కు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీకదీపాలు వెలిగించి నదిలోకి వదిలారు. బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాలు, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ అర్చనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్