వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ 3. 08 లక్షల కుచ్చుటోపి పెట్టిన వ్యక్తిపై గద్వాల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గట్టు మండలం వెంకంపేట గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఉద్యోగం ఆశ చూపి డబ్బులు వసూలు చేశాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.