ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ వర్గీకరణకై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలనీ వాబనగిరి రవి మాదిగ అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు హస్సన్ మాదిగ కరపత్రాలు విడుదల చేశారు. మాదిగలకు ఎస్సీ ఏ. బి. సి. డి వర్గీకరణ ద్వారానే విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు లభిస్తాయని హస్సన్ పేర్కొన్నారు.