జోగులాంబ గద్వాల జిల్లాలోని ధర్మారం స్టేజీ వద్ద హైవే-44పై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ స్పాట్ డెడ్ కాగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు బైక్ పై కర్నూల్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిఖితా రెడ్డి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెతో పాటు ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.