జడ్చర్ల ఉరేసుకుని ఆటో డ్రైవర్ సూసైడ్

ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జడ్చర్ల నియోజకవర్గంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం. బాలానగర్ మండలం కేంద్రానికి చెందిన కూచరకంటి రమేష్ (34)కు వివాహం కాగా, ఆటో నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కుటుంబ విషయాల్లో భార్యా భర్తలు తరచు గొడవ పడేవారు. శనివారం రమేష్ నందారం గ్రామానికి వెళ్లే దారిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్