గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ 2024-25 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం (ఎన్వోఎస్ఎస్)లో భాగంగా ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందని బుధవారం మహబూబ్ నగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం. చత్రునాయక్ తెలిపారు. పీహెచీ, పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలలో విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే వారు ఇందుకు అర్హులని, ఈనెల 31 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.