మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లోని పెద్దయపల్లి చౌరస్తా నుండి కేతిరెడ్డిపల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో జోగులాంబ గద్వాల, భూత్ పూర్, వనపర్తి ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు, తిరిగి తమ స్వస్థలాలకు వెళ్తుండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వాహనదారులు పేర్కొన్నారు.