కుటుంబ కలహాలతో భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. నేతాజీ చౌరస్తా సమీపంలో నివాసం ఉండే అనూష (30) కుటుంబ కలహాల నేపథ్యంలో అద్దెకుంటున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.