ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రవినాయక్ ను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. కొన్ని మండలాలలో కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదనే ఫిర్యాదులు రావడంతో బుధవారం ఎమ్మెల్యే సివిల్ సప్లై డీఎంతో ఫోన్ లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ మేరకు కొనుగోళ్ళ ను వేగవంతం చేస్తామని రవి నాయక్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.