జడ్చర్ల మున్సిపాల్టీలో ఓ కాలనీలో దారుణ ఘటన జరిగింది. అక్కడి బాలికపై ఐదుగురు మైనర్లు గ్యాంగ్ రేప్ చేశారు. వారిలో 4, 5వ తరగతుల విద్యార్థులు, ఒకరు 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఉండడం షాకింగ్. ఘటన జరిగే రోజు బాలిక తండ్రి బయటకు వెళ్లగా, తల్లి మరో కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇదే సమయంలో బాలికపై ఈ అఘాయిత్యం జరిగింది. పోక్సో కేసు నమోదు అయింది.