మహబూబ్ నగర్: ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్