మహబూబ్ నగర్: ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టాలి: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సర్కిళ్ల వారీగా నమోదైన నేరాలపై బుధవారం జిల్లా ఎస్పీ జానకి ధరావత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రతి కేసును కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని అన్నారు. నిందితులకు శిక్ష శాతాన్ని పెంచేందుకు పకడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. విచారణ జరగకుండా నిలిచిపోయిన కేసుల గురించి ఎస్పీ ఆరా తీసి, కారణాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్