మహబూబ్ నగర్: అమర జవాన్ కుటుంబానికి అందరూ అండగా ఉండాలి

దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందిన అమరుడు మురళీనాయక్ కు శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లంబాడ హక్కుల పోరాట సమితి క్రోవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్ మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ యుద్ధంలో మన తెలుగు వీరుని మరణ త్యాగం దేశమంతా గర్వించదగినదని, సైనిక కుటుంబానికి యావత్ భారత సమాజం అండగా నిలవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్