దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని గురువారం మహబూబ్ నగర్ ఎస్పీ జానకి ధరావత్ సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధులలో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.