తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ (టిఓఎ) నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కమిటీ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని ఒలంపిక్ భవన్ లో బుధవారం ప్రమాణస్వీకార బాధ్యతలు చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మల్లారెడ్డి ఇతర పాలకవర్గం సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.