మహాత్మా జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు మహాత్మా జ్యోతి బాపూలే చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి మహాత్మా జ్యోతి బా ఫూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.