మహబూబ్ నగర్: కొడుకు మరణం... తల్లి ఆత్మహత్య

కన్న కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన అనసూయ భర్త నుంచి విడిపోయి కొడుకుతో జీవనం కొనసాగిస్తోంది. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందారు. ఆరోజు నుంచి మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తమ్ముడు వెంకటరమణ ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్