రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మాస్టర్ విష్ణువర్ధన్ వివరాల ప్రకారం. మృతుడు మూడు రోజుల క్రితం రైలు నుంచి కిందపడి ఉంటాడని వెల్లడించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని అన్నారు. మృతుడు బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించాడు. వివరాలకు 9848090426 సంప్రదించాలని అన్నారు.