మహబూబ్ నగర్: రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం

రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని కొమిరెడ్డి పల్లి నుంచి హన్వాడ మండలంలోని షేక్ పల్లి వరకు రూ. 3 కోట్ల 45 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణానికి పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, పంచాయితీ రాజ్ డిఇ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్