మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన లావణ్య వెంకట్రాముల కుమార్తె భాగ్యలక్ష్మికి సురభి మెడికల్ కాలేజీ సిద్దిపేటలో ఎంబిబిఎస్ లో సీటు సాధించింది, వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకునిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భాగ్యలక్ష్మికి అండగా ఉంటానని, ఎంబిబిఎస్ చదువుకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బుధవారం భాగ్యలక్ష్మికి రూ 50, 000 అందజేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి యాదయ్య, గుండా మనోహర్, తదితరులు పాల్గొన్నారు.