రాజాపూర్: ఎమ్మెల్యే గారు మా గ్రామానికి బీటీ రోడ్డు మోక్షం లేదా?

రాజాపూర్ మండలం నర్సింగ్ తండాకు బీటీ రోడ్డు మంజూరు అయిందని చెబుతున్నారే తప్ప నేటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో ఉన్న రోడ్డు కృంగిపోయిందని వర్షపు నీరు నిలుస్తూ రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పందించి బీటీ రోడ్డును ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్