వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన శ్యామపూరి గణేష్ ఇటీవల చారకొండ మండలం జూపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులకు తాండ్ర అంబేద్కర్ సంఘం సభ్యులు లక్ష ఇరవై వేల రూపాయలను ఆదివారం ఆర్థిక సాయంగా అందజేశారు.