ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అరెంజ్ అలర్ట్

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్