మొసలి పట్టివేత

మల్దకల్‌ మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో శనివారం సీడ్‌పత్తి సాగు చేస్తుండగా పత్తిపంటలో మొసలి కనబడింది. దీంతో సవారన్న అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి మొసలిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, పంట సమీపంలోని బావిలో మొసలి దూకింది. అధికారులు ఐదుగంటల పాటు శ్రమించి మోటర్ల ద్వారా నీటిని బయటకు తోడి తాళ్ల సాయంతో మొసలిని బయటకుతీశారు.
మొసలిని ఆటోలో తరలించి గద్వాల సమీపంలోని కృష్ణానదిలో వదిలేశారు.

సంబంధిత పోస్ట్