ఎమ్మెల్యే గన్ మెన్ రవి తండ్రి సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంగళవారం సాయంత్రం ఉట్కూరు మండల కేంద్రంలోని రవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజా సానుభూతి తెలిపారు. ఎలా మరణించారు అనే విషయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.