నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఇటీవల నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం సాయంత్రం ఉట్కూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బాపూర్, దంతన్ పల్లి గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.