నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం జకినాలపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని ఊర్కొండపేట రైతు పొలాల్లో 11కేవీ విద్యుత్ తీగలు అకస్మాత్తుగా తెగిపడి మంటలు చెలరేగాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని రైతులు ఆరోపించారు. రైతులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పశువులకు, ప్రాణనష్టం జరగకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా లైన్ల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.