అన్న దారుణ హత్య... న్యాయం కోసం టవర్ ఎక్కిన తమ్ముడు

కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవినేనిపల్లికి చెందిన శివకాశీ గురువారం టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. గ్రామానికి చెందిన కాశన్నను 2023 ఆగస్టు 1న కొంతమంది దుండగులు కిరాతకంగా నరికి చంపారు. హత్య జరిగి నేటికి ఏడాది పూర్తైనా తమకు న్యాయం జరగలేదని కాశన్న తమ్ముడు శివకాశీ స్థానిక టవర్ ఎక్కాడు. తాను బతకదలుచుకోలేదని, టవర్ పై నుంచి దూకి చనిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అవమానిస్తున్నారని శివ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్