వెల్దండ మండల కేంద్రం రాంనగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు కురిమిద్ద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ హాజరై మాట్లాడుతూ, దేశంలో ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని, స్వచ్ఛందంగా బిజెపి సభ్యత్వ నమోదుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.