అత్త మరణంతో కోడలు ఆత్మహత్య

నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన అత్త కడారి లాలమ్మ (80) మరణాన్ని తట్టుకోలేక కోడలు లక్ష్మమ్మ (50) తీవ్ర మనస్తాపంతో మృతి చెందింది. ఒకే ఇంట్లో అత్తా కోడళ్లు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లాలమ్మకు ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

సంబంధిత పోస్ట్