కొల్లాపూర్: అంబేద్కర్ స్ఫూర్తితో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి: మంత్రి

కొల్లాపూర్ పట్టణం, పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామం, చిన్నంబావి మండల కేంద్రంతో పాటు చిన్న దగడగ్రామంలో సోమవారం అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను మంత్రి జూపల్లి స్మరించుకున్నారు. 'బోధించు – సమీకరించు – పోరాడు' సిద్ధాంతాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ అనేక గ్రంథాలను అధ్యయనం చేసి అధ్యయనం నుంచే ఆచరణ మొదలవ్వాలని సూచించారన్నారు.

సంబంధిత పోస్ట్