గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలైన ఘటన కల్వకుర్తి పట్టణంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కల్వకుర్తి ప్రధాన రహదారి ఇందిరా నగర్ కమాన్ వద్ద మండలంలోని జిల్లాల గ్రామానికి చెందిన రాములమ్మ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.