నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం గడచిన 24 గంటలలో 20 కాన్పులు జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. వీరిలో 11 నార్మల్ డెలివరీలు, 9 సిజేరియన్ కాన్పులు ఉన్నాయని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతంగా కాన్పులు చేసిన ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు.