కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు పట్టణంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామానికి చెందిన చరణ్ (20) అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్