కొల్లాపూర్: ఒకే చెట్టుకు ఉరివేసుకున్న వివాహిత, యువకుడు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్లూరుకు చెందిన రేణుక (21), శివ (25) అనే యువతీ యువకులు బావి సమీపంలోని చెట్టుకు ఒకే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రేణుకకు ఇప్పటికే వివాహమై, ఏడాది పాప ఉందని, పుట్టింటికి వచ్చిన ఆమె ఈ యువకుడితో కలిసి సూసైడ్ చేసుకుందని స్థానికులు తెలిపారు. ఎస్ఐ సురేశ్ కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్