నాగర్ కర్నూల్: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వర్రెడ్డి పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు. సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.

సంబంధిత పోస్ట్