కందనూలు మండలం నాగనూల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (58) శనివారం తెల్లవారుజామున కళ్ళు గీసేందుకు పొలం వద్దకు వెళ్ళాడు. చెట్టు ఎక్కి కళ్లు గీస్తుండగా అస్వస్థతకు గురై కింద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. పరీక్షించిన వైద్యులు శ్రీనివాస్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేశారు.