నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పూలే, అంబేడ్కర్ జాతర గోడపత్రికను విడుదల చేశారు. పూలే, అంబేడ్కర్లు సమాజం కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప సంఘసంస్కర్తలని తెలిపారు. యువత పూలే, అంబేడ్కర్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.