నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కి రెండు రక్త పింజరి పాములు ప్రత్యక్షమయ్యాయి. ఇవాళ విధులు నిర్వహించేందుకు కలెక్టరేట్ కి చేరుకున్న సిబ్బందికి కనిపించాయి. దీంతో కలెక్టరేట్ సిబ్బంది స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చారు. పార్క్లో రెండు రక్తపింజర్లను వంశీ, సుమన్లు పట్టుకున్నారు. అనంతరం వాటిని రక్త పింజరాలను సురక్షితంగా అడవిలో విడిచిపెట్టినట్లు స్నేక్ క్యాచర్లు తెలిపారు.