నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉషారాణి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆస్పత్రి సిబ్బందితో కలిసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.